logo
Updated : 29 May 2022 07:52 IST

Hyderabad News: ఊయలని ఊగితే.. ఉరిగా మారిన తల్లి చీర

ఎలీనా మృతదేహం

లాలాపేట, న్యూస్‌టుడే: బతుకుదెరువుకు నగరానికి వచ్చిన దంపతులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది. చీరతో కట్టిన ఊయలలో ఊగుతున్న చిన్నారికి.. ఆ ఊయలే మృత్యు పాశమై ప్రాణం తీసింది. లాలాగూడ ఎస్సై రవీందర్‌ వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడంకు చెందిన ప్రసన్నజ్యోతి, రాజేష్‌ దంపతులు లాలాపేటలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. అతను డ్రైవర్‌గా పని చేస్తుండగా.. ఆమె కూలీ పనులకు వెళుతుంది. శనివారం తల్లి పనికి వెళ్లగా పెద్ద కుమార్తె ఎలీనా(9) తన చెల్లెళ్ల్లతో కలిసి ఆడుకుంటోంది. ఇంట్లో కొక్కానికి తల్లిచీరతో కట్టిన ఊయలలో ఊగుతుండగా ఆ చీర ఎలీనా మెడకు చుట్టుకొని బిగుసుకుపోవటంతో ఊపిరాడక మృతి చెందింది. తన అక్క మాట్లాడటం లేదని గమనించిన పెద్ద చెల్లెలు.. సమీపంలో ఉన్న బంధువులకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.  
 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని