logo

Hyderabad MMTS: నేడు 34 ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు

నగరంలో ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు కొనసాగుతోంది. ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్ని నిలిపేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. దీనికి కారణాలు వెల్లడించలేదు. లింగంపల్లి-హైదరాబాద్‌(9), హైదరాబాద్‌-లింగంపల్లి(9),

Published : 29 May 2022 09:54 IST

ఆ మార్గాల్లో అదనపు బస్సులు నడిపిస్తామన్న ఆర్టీసీ

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు కొనసాగుతోంది. ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్ని నిలిపేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. దీనికి కారణాలు వెల్లడించలేదు. లింగంపల్లి-హైదరాబాద్‌(9), హైదరాబాద్‌-లింగంపల్లి(9), ఫలక్‌నూమా-లింగంపల్లి(7), లింగంపల్లి-ఫలక్‌నూమా(7), సికింద్రాబాద్‌-లింగంపల్లి(1), లింగంపల్లి-సికింద్రాబాద్‌(1) మధ్య సర్వీసుల్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేసిన ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం అదనపు బస్సుల్ని నడిపిస్తామని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ ఇ.యాదగిరి తెలిపారు. కేశవగిరి-బోరబండ:22, సికింద్రాబాద్‌-హైటెక్‌సిటీ: 54, సికింద్రాబాద్‌-బోరబండ: 16, సీబీఎస్‌- పటాన్‌చెరు:108, సికింద్రాబాద్‌- పటాన్‌చెరు: 84 సర్వీసులు నడిపిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని