logo

తన సంతకం ఫోర్జరీ చేశారని రామ్‌గోపాల్‌ వర్మ ఫిర్యాదు

తన సంస్థ లెటర్‌ హెడ్‌ను కాపీ చేయడంతోపాటు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి దుర్వినియోగం చేసిన నట్టి క్రాంతి కుమార్‌, నట్టి కరుణ, నట్టి ఎంటర్‌టైన్మెంట్స్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పంజాగుట్ట

Updated : 29 May 2022 04:12 IST

ఫిర్యాదు కాపీని సీఐ నిరంజన్‌రెడ్డికి ఇస్తున్న రామ్‌గోపాల్‌ వర్మ

పంజాగుట్ట, న్యూస్‌టుడే: తన సంస్థ లెటర్‌ హెడ్‌ను కాపీ చేయడంతోపాటు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి దుర్వినియోగం చేసిన నట్టి క్రాంతి కుమార్‌, నట్టి కరుణ, నట్టి ఎంటర్‌టైన్మెంట్స్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం తన న్యాయవాది ఉమేష్‌తో కలిసి వచ్చి పంజాగుట్ట సీఐ నిరంజన్‌రెడ్డికి ఫిర్యాదు కాపీని అందజేశారు. డేంజరెస్‌ (తెలుగులో మాఇష్టం) ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా నట్టి క్రాంతి, కరుణ నకిలీ లెటర్‌ హెడ్‌, నకిలీ పత్రాలు కోర్టులో సమర్పించి అడ్డుకున్నారని చెప్పారు. పత్రాలు పరిశీలించగా తన సంతకం ఫోర్జరీ చేసినట్లు తెలిసిందన్నారు.  ఫోర్జరీ విషయమై ఫోరెన్సిక్‌ విచారణ జరిపించాలని పోలీసులను కోరినట్టు వర్మ తెలిపారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని