logo

ఉజ్వల యోజన.. లబ్ధిదారులకు రాయితీ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింది గ్యాస్‌ ధరపై రాయితీ ప్రకటించింది. జిల్లాలో ఈ పథకం కింద  దాదాపు 38,330 మంది లబ్ధిదారులున్నారు. ఆన్‌లైన్‌లో సిలిండరును బుక్‌చేసుకుని ఇంటికి డెలివరీ కాగానే

Published : 10 Jun 2022 06:53 IST

న్యూస్‌టుడే, తాండూరు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింది గ్యాస్‌ ధరపై రాయితీ ప్రకటించింది. జిల్లాలో ఈ పథకం కింద  దాదాపు 38,330 మంది లబ్ధిదారులున్నారు. ఆన్‌లైన్‌లో సిలిండరును బుక్‌చేసుకుని ఇంటికి డెలివరీ కాగానే లబ్ధిదారులు నిర్ణీత రూ.1058.50 ధరను చెల్లించాలి. ప్రభుత్వం ఆ తర్వాత రూ.200 రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. కొత్తగా ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండరు పొందే లబ్ధిదారులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ వర్తిస్తుంది.

* ఉజ్వల పథకం మినహా మిగిలిన వంట గ్యాస్‌పై ఇచ్చే రాయితీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. దీంతో వినియోగదారులు ప్రతి సిలిండర్‌పైన నిర్ణీత ధరను చెల్లించి కొనుగోలు చేయాల్సిందే. 

* దీపం పథకం కింద 32,257 మంది, ఒక సిలిండర్‌ 68,503, రెండు సిలిండర్లు :18,764, వాణిజ్య: 3,198, సీఎస్‌ఆర్‌: 21,260 మంది లబ్ధిదారులు ఉన్నారు.

అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది: రాజేశ్వర్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి

వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం రాయితీని ఎత్తేసిన విషయంలో తమకు అధికారికంగా ఇంకా ఆదేశాలు రాలేదు. గ్యాస్‌ ధరల పెరుగుదలను బట్టి ఒక్కో వినియోగదారునికి గతంలో రూ.30 నుంచి రూ.40 రాయితీ కింద డబ్బులు వారి ఖాతాల్లో జమయ్యాయి. తాజాగా రాయితీ ఎత్తేసిన విషయం తమకు అధికారికంగా తెలియాల్సి ఉంది. సిలిండరు కావాల్సిన వినియోగదారులు కేంద్రం నిర్ణయించిన ధరను చెల్లించక తప్పదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని