logo

మానవీయతే ప్రధానాంశంగా పాలగుమ్మి రచనలు

పాలగుమ్మి పద్మరాజు రచనల్లో మానవీయత ప్రధానాంశంగా ఉంటుందని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్‌ అన్నారు. శుక్రవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో నిర్వహించిన ప్రముఖ సాహితీవేత్త పాలగుమ్మి పద్మరాజు

Published : 25 Jun 2022 02:38 IST


నివాళులర్పిస్తున్న వెంకటరెడ్డి, అప్పారావు, ఇనాక్‌, కళా జనార్దనమూర్తి, అంజుబాబు

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: పాలగుమ్మి పద్మరాజు రచనల్లో మానవీయత ప్రధానాంశంగా ఉంటుందని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్‌ అన్నారు. శుక్రవారం త్యాగరాయ గానసభ నిర్వహణలో నిర్వహించిన ప్రముఖ సాహితీవేత్త పాలగుమ్మి పద్మరాజు జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. తెలుగు భాషలో ఎంత గొప్ప సాహిత్యమున్నా ఆంగ్ల అనువాదం ఉత్తమంగా లేకుంటే గుర్తింపు ఉండదన్నారు. కార్యక్రమంలో సెన్సార్‌ బోర్డు సభ్యుడు అప్పారావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, కథక్‌ కళాక్షేత్ర వ్యవస్థాపకుడు పండిట్‌ అంజుబాబు, జీవీఆర్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు జి.వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు