logo

రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి: బీసీ మహాసభ

బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 25 Jun 2022 02:38 IST

గోల్నాక, న్యూస్‌టుడే: బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం చాదర్‌ఘాట్‌లోని సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లును పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు వై.కృష్ణ, పులిజాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి మెట్టు ముత్యాల్‌రావు, కార్యదర్శులు సీహెచ్‌ ప్రదీప్‌గౌడ్‌, నల్లెల్ల కిశోర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని