logo

‘నంబర్‌-1 బ్రాండ్‌గా ఫ్రీడమ్‌ రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌’

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అమ్మకాల పరిమాణం విభాగంలో ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నంబర్‌-1 బ్రాండ్‌గా నిలిచిందని జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ చౌదరి పేర్కొన్నారు.

Published : 25 Jun 2022 02:38 IST

ప్రదీప్‌ చౌదరి

ఈనాడు, హైదరాబాద్‌: సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అమ్మకాల పరిమాణం విభాగంలో ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నంబర్‌-1 బ్రాండ్‌గా నిలిచిందని జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రదీప్‌ చౌదరి పేర్కొన్నారు. బేగంపేట్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో  శుక్రవారం జరిగిన ‘బిజినెస్‌ నావిగేషన్‌ అండ్‌ ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఫర్‌ జీఈఎఫ్‌ ఇండియా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీల్సన్‌ ఐక్యూ మ్యాట్‌- 2022 నివేదిక ప్రకారం.. మార్కెట్‌లో 20.5శాతం వాటా కలిగి ఉన్నట్లు తెలిపారు. వినియోగదారుల లక్ష్యిత విధానం, విస్తృత శ్రేణి పంపిణీ నెట్‌వర్క్‌, నాణ్యతపై దృష్టి వల్లే ఇది సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) పి.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని