logo

క్షణాల్లో చేరేలా.. మంటల్ని ఆర్పేలా

మహానగరంలో అగ్నిప్రమాదం జరిగితే మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైరింజన్లు ఘటన స్థలానికి వేగంగా చేరుకోవడమే ప్రధానం. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌ను దాటుకుంటూ వేగంగా వెళ్లడం సవాలే. కొన్నిసార్లు క్షణం

Published : 27 Jun 2022 02:43 IST

జీపీఎస్‌తో హై‘టెక్‌’ ఫైరింజన్లు
ట్రాఫిక్‌ అడ్డంకిని దాటేందుకు అగ్నిమాపక శాఖ ప్రతిపాదన

గ్రేటర్‌లో అగ్నిమాపక కేంద్రాలు 25
మొత్తం ఫైరింజన్లు 55

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరంలో అగ్నిప్రమాదం జరిగితే మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ఫైరింజన్లు ఘటన స్థలానికి వేగంగా చేరుకోవడమే ప్రధానం. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌ను దాటుకుంటూ వేగంగా వెళ్లడం సవాలే. కొన్నిసార్లు క్షణం ఆలస్యమైనా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి. దీనికి విరుగుడుగా అగ్నిమాపక శాఖ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు సిద్ధమవుతోంది. నగరంలోని ఫైరింజన్లకు జియో పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌)ను అమర్చనుంది. కైట్‌- ఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆటంకాల్లేకుండా నిమిషాల వ్యవధిలో చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

జీపీఎస్‌ పనితీరు ఎలాగంటే?

గ్రేటర్‌లోని అన్ని ఫైరింజన్లలో జీపీఎస్‌ పరికరాలు ఏర్పాటు చేస్తారు. దీన్ని అగ్నిమాపక శాఖ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానిస్తారు.

ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి ఫోన్‌ వస్తే.. జీపీఎస్‌ ద్వారా సమీపంలో ఉన్న వాహనాన్ని పంపిస్తారు.

కమాండ్‌ కంట్రోల్‌లోని తెరపై ఫైరింజన్‌ ట్రాఫిక్‌, ఇతర ఆటంకాల్లేకుండా వెళ్తుంటే ఆకుపచ్చ, బాగా నెమ్మదిగా వెళ్తే పసుపు రంగు, వాహన ఇంజిన్‌ ఆపితే ఎరుపు రంగు వస్తుంది. పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తారు. అవసరమైతే ట్రాఫిక్‌ పోలీసుల సాయం తీసుకుంటారు.

కైట్‌- ఐ సాంకేతిక ద్వారా ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో నీటి వనరులు అందుబాటులో ఉన్నాయో.. లేదో తెలుసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని