logo
Published : 27 Jun 2022 02:43 IST

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు రేపు

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ఈనెల 28న ఉదయం 10:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ రంగనాథ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మోనప్ప ఐల్యాండ్‌ (రాజీవ్‌ గాంధీ విగ్రహం) నుంచి వీవీ విగ్రహం కూడలి వరకు రద్దీ ఉంటుందని, అవసరాన్ని బట్టి ఈ కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తాం.. లేదా నిలిపివేస్తామన్నారు. వీవీ విగ్రహం కూడలి, పంజాగుట్ట, రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌ రోడ్‌ (మెట్రో రెసిడెన్సీ)లలో ట్రాఫిక్‌ను అనుమతించరు.

వాహనాల పార్కింగ్‌....

గేట్‌ నంబరు 3 నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌లో న్యాయమూర్తులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాహనాలు.

దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌లో మీడియా.

ఎంఎంటీఎస్‌ పార్కింగ్‌ స్థలంలో ఇతర వీఐపీ, ప్రభుత్వ ప్రముఖులు.

లేక్‌వ్యూ నుంచి వీవీ విగ్రహం జంక్షన్‌ వరకు (లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ ఎదురుగా) సింగిల్‌లేన్‌ పార్కింగ్‌.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని