logo

తయారీకి దివ్యౌషధం

ఏ దైనా ఔషధం తయారు చేయాలంటే.. ఎన్నో రకాల మూలకాలు వినియోగించాలి. వివిధ రసాయన చర్యలతో వాటి నిర్మాణంలో మార్పులు తీసుకురావాలి. ఇందుకు భారీగా సమయం, ఎక్కువ అవుతుంది. ప్రత్యామ్నాయ మూలకాలను హైదరాబాద్‌

Published : 27 Jun 2022 02:43 IST

ఈనాడు, హైదరాబాద్‌

దైనా ఔషధం తయారు చేయాలంటే.. ఎన్నో రకాల మూలకాలు వినియోగించాలి. వివిధ రసాయన చర్యలతో వాటి నిర్మాణంలో మార్పులు తీసుకురావాలి. ఇందుకు భారీగా సమయం, ఎక్కువ అవుతుంది. ప్రత్యామ్నాయ మూలకాలను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధకులు తయారు చేశారు. వర్సిటీలోని రసాయన శాస్త్ర ఆచార్యుడు డి.బి.రామాచారి నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు పెరకస్వామి, బి.గోరచంద్‌, అక్రమ్‌హుస్సేన్‌, రేవోజు స్రవంతి భాగస్వాములయ్యారు. ఫలితాలు యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆర్డానిక్‌ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి.

నూతన మూలకాలు తయారు చేసిన హెచ్‌సీయూ పరిశోధకులు
రసాయన శాస్త్రం ప్రకారం సహజ సిద్ధంగా 162 రకాల మూలకాలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్‌, మలేరియాతోపాటు బ్యాక్టీరియాతో వ్యాప్తి చెందే వ్యాధులకు మందు తయారీలో ఆయా మూలకాలు కీలకం. వీటి తయారీకి ముందుగా ఆయా మూలకాల స్వరూపం, పరిమాణంలో ఎన్నో మార్పులు చేయాల్సి వస్తోంది. దీన్ని నిరోధించేలా సహసిద్ధంగా లభించే మూలకాలకు ప్రత్యామ్నాయంగా 62 రకాల మూలకాలను హెచ్‌సీయూ పరిశోధకులు తయారు చేశారు. వీటిద్వారా ఒక్కసారి(ఒన్‌ పాట్‌) చేసే చర్యతో మనకు అవసరమైన పదార్థాలు తయారు చేసేందుకు వీలవుతుంది.


వ్యర్థాలకు ఆస్కారం లేదు: డి.బి.రామాచారి, ఆచార్యుడు
మేం తయారు చేసే మూలకాలతో ఔషధాలు, క్రిమిసంహారాలు సహా ఎన్నో రకాల పదార్థాలు ఒకే చర్యలో తయారు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో వ్యర్థాలు ఎక్కువగా వెలువడే అవకాశం లేదు. సమయం తక్కువ పడుతుంది. త్వరగా నిర్దేశిత రసాయనాలు, పదార్థాలు తయారు చేసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం వాటి సామర్థ్యాలు పరిశీలించిన తర్వాత కంపెనీలు ముందుకొస్తే పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని