logo
Published : 27 Jun 2022 02:40 IST

పూర్తిస్థాయిలో డ్రగ్స్‌ అరికట్టేందుకు చర్యలు

జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న  డాక్టర్‌ బి.భాస్కరరావుతో డీసీపీ జి.చక్రవర్తి

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నార్కోటిక్‌ విభాగం డీసీపీ జి.చక్రవర్తి తెలిపారు. యువత డ్రగ్స్‌ బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఏ రకం విషపదార్థానికి ఎలాంటి వైద్యం చేయాలన్న అంశంపై ద్వితీయ, తృతీయ శ్రేణి ఆసుపత్రుల వైద్యులు, తెలుగు రాష్ట్రాల్లోని వైద్యులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఆదివారం సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో ఇంటర్నల్‌ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో టాక్సికాన్‌-2022 పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ జి.చక్రవర్తి, కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ బి.భాస్కరరావు, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సబిత్‌ సాహు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ వి.జగదీష్‌కుమార్‌లతో కలిసి జ్యోతి వెలిగించి సదస్సు ప్రారంభించారు. డాక్టర్‌ మణిమాలరావు, వినయ్‌శేఖర్‌, శ్రీరంగ్‌ ఆబ్కారీ, సింగంశెట్టి, హర్ష్‌ ఖండేలియా, నావాల్‌చంద్ర, ఎల్‌.మధుసూదన్‌రెడ్డి, సుభాష్‌కౌల్‌, వడ్లమాని నరేష్‌ ఛైర్‌పర్సన్లుగా వ్యవహరించారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని