logo

సత్వర న్యాయానికి లోక్‌అదాలత్‌

కాలయాపన లేకుండా సత్వర న్యాయం పొందటం లోక్‌అదాలత్‌లతో సాధ్యమవుతుందని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌ రేణుకా యారా తెలిపారు. జాతీయ

Published : 27 Jun 2022 02:40 IST

సిటీ సివిల్‌ కోర్టులో 1,518, మెట్రోపాలిటన్‌ కోర్టులో 3,55,727 కేసుల పరిష్కారం

సభలో పరిష్కరించిన బ్యాంక్‌ కేస్‌లో అవార్డ్‌ అందజేస్తున్న చీఫ్‌ జడ్జి రేణుక యారా  

ఈనాడు, హైదరాబాద్‌- చార్మినార్‌, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: కాలయాపన లేకుండా సత్వర న్యాయం పొందటం లోక్‌అదాలత్‌లతో సాధ్యమవుతుందని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌ రేణుకా యారా తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌లో హైదరాబాద్‌ జిల్లా స్థాయిలో పలు సివిల్‌ కోర్టుల్లో మొత్తం 1,518 సివిల్‌ కేసులు పరిష్కరించి బాధితులకు, వాదులకు రూ.24కోట్ల 70 లక్షలు 81వేలకు పైగా నష్టపరిహారం అందజేసేలా కేసులను రాజీకి కుదిర్చినట్లు వెల్లడించారు. ఆదివారం పురానాహవేలిలోని సిటీ సివిల్‌ కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రారంభించిన ఆమె.. న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని ప్రసంగించారు. నగరంలోని సివిల్‌ కోర్టుల్లో మొత్తం 10 బెంచీలు ఏర్పాటుచేసి లోక్‌అదాలత్‌ నిర్వహించగా.. మొత్తం 324 మోటార్‌ ప్రమాదం, బీమా క్లెయిమ్‌ కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. ప్రి లిటిగేషన్‌ కేసులు, ఎస్‌బీఐ బ్యాంక్‌ కేసులు 1092కు పైగా పరిష్కరించినట్టు వివరించారు.

లోక్‌అదాలత్‌లో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో సివిల్‌ కోర్టులకు విచ్చేసిన కక్షిదారులకు న్యాయ సేవాధికార సంస్థ నీరు, ఆహార పొట్లాలు సదుపాయం కల్పించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్‌ కోర్టు కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కే.మురళీమోహన్‌ తెలిపారు.

సిటీ సివిల్‌ కోర్టు హైదరాబాద్‌ న్యాయస్థానంలోని లోక్‌అదాలత్‌ బెంచ్‌లకు చీఫ్‌ జడ్జి రేణుకా యారా, సిటీ స్మాల్‌ కాజు కోర్టు చీఫ్‌ జడ్జి నిర్మల గీతాంబ, రెండవ అదనపు చీఫ్‌ జడ్జి కె ప్రభాకర్‌రావు, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఉమాదేవి, అపర్ణ, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్‌ మహి, జూనియర్‌ సివిల్‌ జడ్జి అరుణ్‌కుమార్‌ తదితరులు నేతృత్వం వహించారు. సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో అదనపు చీఫ్‌ జడ్జి జీవన్‌కుమార్‌ నేతృత్వం వహించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని