logo

వైద్యం వికటించి గర్భిణి మృతి

పీర్జాదిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అబార్షన్‌ వికటించి గర్భిణి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన ప్రవీణ్‌, కె.కవిత(30)భార్యాభర్తలు. ఏడేళ్ల

Published : 27 Jun 2022 02:40 IST

మేడిపల్లి(బోడుప్పల్‌), న్యూస్‌టుడే: పీర్జాదిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అబార్షన్‌ వికటించి గర్భిణి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన ప్రవీణ్‌, కె.కవిత(30)భార్యాభర్తలు. ఏడేళ్ల క్రితం పెళ్లయ్యింది. ప్రవీణ్‌ వృత్తిరీత్యా స్వర్ణకారుడు. వారికి ఇద్దరు కూతుర్లు. కవిత ప్రస్తుతం అయిదు నెలల గర్భిణి. మూడో కాన్పులోనూ అమ్మాయిగా నిర్ధారించుకొని పీర్జాదిగూడలోని కౌండిన్య ఆస్పత్రిలో అబార్షన్‌కి సంప్రదించారు. శనివారం రాత్రి దవాఖానాలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం అబార్షన్‌ చేశారు. తర్వాత ఆస్పత్రి వార్డులోకి తీసుకెళ్లారు. అనంతరం స్పృహ కోల్పోయిన ఆమె ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి యజమాని డాక్టర్‌ పాండు, సిబ్బంది పరారయ్యారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ జిల్లా ఉప వైద్యాధికారి నారాయణరావు వివరణ కోరగా.. ఆయన మాట్లాడుతూ..  దవాఖానాకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని