logo

రాష్ట్రంలో పబ్‌ సంస్కృతి పెరిగింది: ప్రొ.కోదండరాం

రాష్ట్రంలో పబ్‌ సంస్కృతి పెరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చి ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో

Published : 27 Jun 2022 02:40 IST

డ్రగ్స్‌పై అవగాహన కల్పించే కరపత్రాన్ని విడుదల చేస్తున్న ప్రొ.కోదండరాం, శ్రీనివాస్‌రెడ్డి, ఇందిరాశోభన్‌ తదితరులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పబ్‌ సంస్కృతి పెరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చి ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సోషల్‌ మీడియా ఫోరమ్‌ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినం’ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 300 శాతం మద్యం అమ్మకాలు పెరిగాయన్నారు. యువత మద్యం, మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్ల హింస పెరుగుతుందని పేర్కొన్నారు.  సీనియర్‌ పాత్రికేయులు శ్రీనివాస్‌రెడ్డి, ఫోరమ్‌ అధ్యక్షుడు పాశం యాదగిరి, తెలంగాణ మేధావుల సంఘం ఛైర్మన్‌ డా.కేశవులు ఆప్‌ నేత ఇందిరాశోభన్‌, పర్యావరణవేత్త నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పన్నాల శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు