logo

అలనాటి నటి కృష్ణవేణికి సత్కారం

రాష్ట్రీయ తెలుగు సమాఖ్య గత నెల 8వ తేదీ నుంచి జులై 3 వరకు అంతర్జాలంలో జరుపుతున్న అంతర్జాతీయ ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అలనాటి నటి, నిర్మాత సి.కృష్ణవేణిని ఫిలింనగర్‌లోని ఆమె స్వగృహంలో

Published : 27 Jun 2022 02:40 IST

కృష్ణవేణిని సత్కరిస్తున్న సాయికుమార్‌ తదితరులు

ఫిలింనగర్‌ న్యూస్‌టుడే: రాష్ట్రీయ తెలుగు సమాఖ్య గత నెల 8వ తేదీ నుంచి జులై 3 వరకు అంతర్జాలంలో జరుపుతున్న అంతర్జాతీయ ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అలనాటి నటి, నిర్మాత సి.కృష్ణవేణిని ఫిలింనగర్‌లోని ఆమె స్వగృహంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఘంటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో సినీ నటులు తనికెళ్ల భరణి, సాయికుమార్‌లు పాల్గొన్నారు. తాను ఇంకా చిత్రాలకు నిర్మాతగా పనిచేయాలని ఉందని, కూతురు తన వయసు రీత్యా ఒప్పుకోవడం లేదని కృష్ణవేణి పేర్కొన్నారు. కార్యక్రమంలో డా.కె.వి.రావు, పీవీపీసీ ప్రసాద్‌, పీవీ ప్రసాద్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని