logo
Published : 27 Jun 2022 02:40 IST

ఆచరణకు నోచని.. రూ.5కే భోజనం

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలోని నాలుగు పట్టణాల్లో దశల వారీగా రూ.5కే భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నేటికీ అమలుకు నోచడంలేదు. తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పట్టణాలకు నిత్యం వేల మంది కార్మికులు, కూలీలు, చిరు వ్యాపారులు, అడ్డాకూలీలు ఉదయం వచ్చి సాయంత్రానికి వెళతారు. మధ్యాహ్నం వీరంతా హోటల్‌లో భోజనం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఇటువంటి వారికి హరేకృష్ణ సొసైటీతో ఆహారం అందించాలని 2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికలకు ముందు అధికారులు నిర్ణయించారు. ఆమేరకు జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ కింద తాండూరుకు రూ.28 లక్షలు, వికారాబాద్‌కు రూ.32 లక్షల చొప్పున కేటాయించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రం కావడంతో పట్టణానికి వచ్చిపోయే వారు ఎక్కువగా ఉంటారనే ఉద్దేశంతో నిత్యం 500 మందికి, తాండూరులో 300 మందికి భోజనం అందించాలనుకున్నారు. ఈలెక్కన వికారాబాద్‌ పట్టణంలో ఏడాదికి రూ.74 లక్షలు, తాండూరు పట్టణంలో రూ.50 లక్షలు వ్యయమౌతాయని అంచనా వేశారు. భోజనాలను పంపిణీ చేసే హరేకృష్ణ సొసైటీకి ఇచ్చే రాయితీ పోనూ ప్రభుత్వం కొంత మేర చెల్లించాలన్నది ఉద్దేశం. తాండూరు, వికారాబాద్‌లో విజయవంతమైతే పరిగి, కొడంగల్‌లో అమలు చేయాలనుకున్నారు. అయితే అడుగు ముందుకు పడలేదు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని