logo

సత్యమూర్తి అదృశ్యం కేసు దర్యాప్తు ముమ్మరం

భార్య ఆచూకీ చెప్పాలంటూ సెల్ఫీ వీడియో తీసి పిల్లలతో కలిసి అదృశ్యమైన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి కేసు దర్యాప్తు వేగవంతమైంది. తాండూరు నివాసి సత్యమూర్తి భార్య

Published : 27 Jun 2022 02:40 IST

తాండూరు టౌన్‌: భార్య ఆచూకీ చెప్పాలంటూ సెల్ఫీ వీడియో తీసి పిల్లలతో కలిసి అదృశ్యమైన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి కేసు దర్యాప్తు వేగవంతమైంది. తాండూరు నివాసి సత్యమూర్తి భార్య మూడు నెలల కిందట అదృశ్యమైంది. కేసు దర్యాప్తు సాగుతోంది. ఎంతకీ ఆచూకీ తెలియలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన శనివారం పిల్లలిద్దరితో కలిసి 48 గంటల్లో ఆమె ఆచూకీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్‌లో పోస్ట్‌ చేసి ఇంటినుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై స్థానికంగా తీవ్ర కలకలం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందు కోసం డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పట్టణ, గ్రామీణ సీఐలు రాజేందర్‌రెడ్డి, రాంబాబు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సత్యమూర్తి వెళ్లిన కారును సీసీ కెమెరాల ఆధారంగా అతను శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లినట్లు, అక్కడి నుంచి ఇద్దరు కూతుళ్లతో విమానంలో ముంబయి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వివరాలను డీఎస్పీ ఆదివారం మీడియాకు వెల్లడించారు. అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. సత్యమూర్తి ముంబయిలోనే ఉన్నారని ఓ నిర్ధరణకు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఎస్పీ ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని