logo

రాజీ పడితే.. ఇద్దరూ నెగ్గినట్లే

‘ప్రజలు ఎలాంటి పట్టింపులకు పోకుండా క్షమాగుణాన్ని అలవర్చుకొని కేసుల విషయంలో రాజీ కుదుర్చుకోవాలి. లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకుంటే ఇద్దరూ నెగ్గినట్లేనని’ జిల్లా ప్రిన్సిపల్‌ న్యాయమూర్తి సుదర్శన్‌ అన్నారు. ఆదివారం

Published : 27 Jun 2022 02:40 IST

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌ సమక్షంలో నిర్వహిస్తున్న లోక్‌ అదాలత్‌

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ‘ప్రజలు ఎలాంటి పట్టింపులకు పోకుండా క్షమాగుణాన్ని అలవర్చుకొని కేసుల విషయంలో రాజీ కుదుర్చుకోవాలి. లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకుంటే ఇద్దరూ నెగ్గినట్లేనని’ జిల్లా ప్రిన్సిపల్‌ న్యాయమూర్తి సుదర్శన్‌ అన్నారు. ఆదివారం స్థానిక న్యాయస్థానంలో జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ఆయన మాట్లాడారు. అధికంగా కేసులు రాజీ చేయడంలో జిల్లాకు 13వ స్థానం దక్కిందని, దీనిని మరింత మెరుగు పరిచి తొలి స్థానానికి తీసుకువచ్చేలా అందరి సమన్వయంతో కృషి చేద్దామన్నారు. అపరిష్కృత కేసులతో ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో జాప్యం జరుగుతోందని, దీన్ని నివారించడానికే లోక్‌ అదాలత్‌ కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. లోక్‌ అదాలత్‌లో 1,770 కేసులను రాజీ చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయమూర్తి శంకరి శ్రీదేవి, జూనియర్‌ న్యాయమూర్తి శ్రీకాంత్‌, అదనపు జూనియర్‌ న్యాయమూర్తి శృతిదూత, ఏపీపీలు అశోక్‌కుమార్‌, నారాయణగౌడ్‌, సమీనాబేగం, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్‌, సీనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

పరిగి, న్యూస్‌టుడే: రాజీ చేసుకోవడం ద్వారా గెలుపు ఇద్దరిదీ అవుతుందని స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి వి.హరికుమార్‌ అన్నారు. ఆదివారం కోర్టు ఆవరణలో జరిగిన లోక్‌ అదాలత్‌లో పాల్గొని మాట్లాడారు. సంయమనం పాటిస్తే సమస్యలు చాలా వరకు నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏపీపీఓ దీపారాణి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.నరేంద్రయాదవ్‌, ఏజీపీ బాలముకుందం, న్యాయవాదులు వెంకట్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్‌, బాలకృష్ణారెడ్డి తదితరులున్నారు.
తాండూరు టౌన్‌: తాండూరులోని మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి స్వప్న ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. మొత్తం 156 కేసులను రాజీ కుదిర్చారు. ఇతర సాధారణ కేసులు 873 ఉండగా వాటినీ పరిష్కరించారు. కార్యక్రమంలో లోక్‌ అదాలత్‌ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, విజయ కుమార్‌ తిరుమల్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కార్యదర్శి మహేందర్‌రెడ్డి, న్యాయ వాదులు శ్రీనివాస్‌, రాంరెడ్డి, మహిళా న్యాయవాదులు వాణిశ్రీ, సోఫియా, రజిత తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని