logo
Published : 27 Jun 2022 02:40 IST

కళాశాలల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శోకం

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల సిబ్బంది నిర్లక్ష్యంతో వందలాది విద్యార్థులు డిగ్రీ పరీక్షలకు దూరం కావాల్సి వచ్చింది. ఓయూ పరిధిలో ప్రస్తుతం డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు తాము చదువుతున్న కళాశాలలో డిగ్రీ పరీక్షల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కళాశాల సిబ్బంది విద్యార్థుల దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే వర్సిటీలోని పరీక్షల నియంత్రణ కేంద్రానికి సమర్పించాలి. అనేక కళాశాలలు విద్యార్థుల వద్ద పరీక్షల ఫీజులు తీసుకుని వాటిని యూనివర్సిటీకి చెల్లించలేదు. దీంతో విద్యార్థులకు హల్‌టికెట్‌ రాకపోవడంతో విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై ఇప్పటికే పది కళాశాలలకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థులు ఓయూ పరీక్షల విభాగాన్ని సంప్రదించినట్లు కంట్రోలర్‌ ప్రొ.శ్రీనగేశ్‌ తెలిపారు.

బాధితులు 3 వేల కంటే ఎక్కువ మంది ఉన్నారని ఏఐఎస్‌ఎఫ్‌ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ  శంకర్‌ తెలిపారు.

వారిదే బాధ్యత: ప్రొ.లక్ష్మినారాయణ, ఓయూ రిజిస్ట్రార్‌
కళాశాలల సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే విద్యార్థులకు నష్టం జరిగింది. హల్‌టికెట్‌ ఇచ్చేందుకు వర్సిటీకి కనీసం మూడు రోజుల సమయం పడుతుంది. విద్యార్థులు పరీక్షల ప్రారంభానికి ముందురోజు రావడంతో ఏమి చేయలేక పోయాం. ఓ కళాశాల ప్రిన్సిపల్‌ను ఇదే విషయంపై ప్రశ్నిస్తే తాము మరిచిపోయినట్లు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. వారిపై ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తాం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts