అర్ధరాత్రి దాటే వరకూ ఆటాపాట!
పోలీసుల హెచ్చరికలు పట్టించుకోని పబ్‌లు
జూబ్లీహిల్స్‌లో ఓ పబ్ వద్ద రాత్రివేళ గొడవ పడుతున్న యువకులు
ఈనాడు, హైదరాబాద్ న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్: నగరంలోని పలు పబ్‌లు పోలీసుల హెచ్చరికల్ని పెడచెవిన పెడుతున్నాయి. ఇటీవలే చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో రెండుసార్లు పోలీసు, ఆబ్కారీ ఉన్నతాధికారులు పబ్‌ల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి, నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో కొద్దిరోజులు కట్టుబడినట్లు కనిపించినా వారాంతాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పబ్‌లు అర్ధరాత్రి దాటేంత వరకూ తెరిచే ఉంటున్నాయి. తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులతో మద్యం మత్తులో ఉన్న యువత గొడవకు దిగుతున్నారు. వారిలో ప్రముఖుల పిల్లలే అధికంగా ఉండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు. పోలీసు, ఆబ్కారీ శాఖల సమన్వయం కొరవడంతో పబ్‌లు ఆడింది ఆట.. పాడింది పాటగా పరిస్థితి తయారైందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవలి కొన్ని ఘటనలు..
* జూబ్లీహిల్స్‌లోని ఓ కాఫీ క్లబ్ వద్ద శనివారం అర్ధరాత్రి కారెక్కుతున్న ఓ యువతితో యువకుడు అసభ్యంగా ప్రవర్తించటంతో మొదలైన గొడవ కొట్లాటకు దారి తీసింది. అక్కడికు వచ్చిన పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు ‘పోలీసులైతే ఏంటి? అంటూ ఎస్సైను నెట్టివేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
* ఇటీవల రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బార్లో యువతి ఫోన్ నంబరు అడిగితే ఇవ్వనంటూ తిరస్కరించటంతో రెచ్చిపోయిన యువకుడు అత్యాచారం చేస్తానంటూ బెదిరించాడు. ఇది గొడవకు దారి తీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
* జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో భార్యాభర్తల్ని బౌన్సర్లు బయటకు నెట్టేయటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
* గచ్చిబౌలి వద్ద మద్యం మత్తులో యువకుడు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
-
Sports News
Axar : జడేజాకు షాడో.. అప్పటివరకు జట్టులోకి అక్షర్ కష్టమే: భారత మాజీ ఆటగాడు
-
India News
CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Movies News
Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?