Crime News: ఆస్పత్రికొచ్చిన గర్భిణిని పట్టించుకోకుండా పార్టీ.. గర్భంలోనే శిశువు మృతి!

నగరంలోని చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం వల్ల శిశువు మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

Updated : 27 Jun 2022 15:10 IST

హైదరాబాద్: నగరంలోని చాదర్‌ఘాట్‌ పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం వల్ల శిశువు మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సదరు ఆస్పత్రికి చెందిన ఓ డాక్టర్ కుమార్తె వివాహం వచ్చే నెలలో ఉండటంతో ఆస్పత్రి బిల్డింగ్‌పైన ముందస్తు పార్టీ ఏర్పాటు చేశారు. డీజే సిస్టమ్‌ పెట్టుకొని ఆటపాటలతో వేడుకలు నిర్వహించారు. అదే సమయంలో కడుపునొప్పితో ఉన్న గర్భిణిని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా ఆస్పత్రి సిబ్బంది ఆమెను పట్టించుకోలేదు. వైద్య సిబ్బంది పార్టీలో బిజీగా ఉండడంతో కాసేపటికి గర్భంలోని శిశువు మృతిచెందింది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శిశువు మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని