Secunderabad violence: కావాలనే నన్ను ఇరికించారు: బెయిల్‌ పిటిషన్‌లో సుబ్బారావు

అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల సికింద్రాబాద్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న, సాయి

Updated : 27 Jun 2022 17:12 IST

హైదరాబాద్‌: అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల సికింద్రాబాద్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న, సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్మీలో సేవ చేసి.. అదే స్ఫూర్తితో యువత సైన్యంలో చేరేలా ప్రోత్సహించినట్లు అందులో వివరించారు. పోలీసులు తనను కావాలనే అల్లర్ల కేసులో ఇరికించారని ఆరోపించారు. సికింద్రాబాద్‌ ఘటనకు సంబంధించి ఆవుల సుబ్బారావు ఏ64గా, ఏ1గా మధుసూదన్, ఏ2గా పృథ్విరాజ్‌ అనే వ్యక్తులున్నారు.

అల్లర్లకు సూత్రధారిగా పేర్కొంటూ సుబ్బారావుతో పాటు అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు. రైల్వే కోర్టులో హాజరుపరచగా.. వాదనలు విన్న రైల్వే న్యాయస్థానం వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో సుబ్బారావుతో పాటు అతని అనుచరులను చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని