GHMC: విధుల్లో నిర్లక్ష్యంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆగ్రహం.. 38 మంది ఇంజినీర్ల జీతాల్లో కోత

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) ఇంజినీరింగ్ అధికారులపై కమిషనర్ లోకేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ పరిధిలో నాలాల దగ్గర ముందస్తు

Updated : 28 Jun 2022 15:03 IST

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) ఇంజినీరింగ్ అధికారులపై కమిషనర్ లోకేశ్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ పరిధిలో నాలాల దగ్గర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన వారిపై చర్యలు తీసుకున్నారు. నగరంలో ప్రమాదకరమైన నాలాలను గుర్తించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పదేపదే ఆదేశించినా స్పందించకపోవడంతో ఇంజినీర్లపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు. పలు నాలాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన లోకేశ్‌కుమార్‌.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన 38 మంది జీహెచ్ఎంసీ ఇంజినీర్ల ఒకరోజు వేతనాన్ని కట్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నగర ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని.. నాలాలపై జాగ్రత్తలు తీసుకోని అధికారులందరిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కమిషనర్ తెలిపారు. భవిష్యత్తులో ఇదే తరహాలో వ్యవహరిస్తే ఎలాంటి నోటీసు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్‌కుమార్ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని