Hyd News: చీకటి గదిలో బంధించి చిత్రహింసలు.. కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం

నగరంలోని ఎల్బీనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో కుమారుడు, కోడలిపై వృద్ధ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. తమను ఇంటి నుంచి తరిమేసి

Updated : 28 Jun 2022 18:02 IST

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో కుమారుడు, కోడలిపై వృద్ధ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. తమను ఇంటి నుంచి తరిమేసి వేధిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌.. ఇంటిని ఖాళీ చేయించి వృద్ధులకు అప్పజెప్పాలని ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వృద్ధులతో సహా రెవెన్యూ, పోలీస్‌ అధికారులు ఇంటికి చేరుకున్నారు. ఈ లోపే కుమారుడు, కోడలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో ఆ వృద్ధ దంపతులు ఇంటి ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని