TS TET: తెలంగాణ టెట్‌ ఫలితాల విడుదలకు తేదీ ఖరారు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. టెట్‌ ఫలితాలను జులై 1న విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ

Published : 28 Jun 2022 15:25 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. టెట్‌ ఫలితాలను జులై 1న విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తొలుత విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ నెల 27వ తేదీన టెట్‌ ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. దీనిపై ఆదివారం రాత్రివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. తాజాగా ఫలితాల విడుదలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పేపర్‌-1కు 3,18,506 (90.62శాతం), పేపర్‌-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని