Crime News: పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానని ఒకరు, తక్కువ మార్కులు వచ్చాయని మరొకరి బలవన్మరణం

పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైతాననే అనుమానంతో ఓ బాలుడు మానసిక ఆవేదన గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన

Updated : 28 Jun 2022 16:32 IST

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే అనుమానంతో ఓ బాలుడు మానసిక ఆందోళనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. రాంనగర్‌కు చెందిన నర్సింగరావు కుమారుడు .. ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. త్వరలో వెల్లడి కావాల్సిన ఉన్న ఈ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్‌ అవుతానని డేవిడ్‌ మానసిక ఆందోళన గురయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి నర్సింగరావు ఏడాదిన్నర కిందట కరోనాతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

తక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్‌ విద్యార్థి...

ఇంటర్‌ ఎంపీసీలో తక్కువ మార్కులతో పాస్‌ కావడంతో అవమానంగా భావించి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. చింతలబస్తీకి చెందిన గౌతమ్‌ కుమార్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన సైఫాబాద్‌ పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని