GHMC: భారీ వర్షం కురిసే అవకాశం... అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ

నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు

Updated : 28 Jun 2022 19:43 IST

హైదరాబాద్‌: నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తంగా ఉంచింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. సికింద్రాబాద్, అల్వాల్‌, నెరేడ్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. మరో వైపు రాష్ట్రంలో అక్కడక్కడ ఈరోజు రేపు భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ..దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 900మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని