logo

ఆత్మహత్యల నివారణకు ఉచిత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌

ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల ఆత్మహత్యలకు వారి తల్లిదండ్రుల ఒత్తిడి కూడా కారణమని భారత ప్రగతిశీల మనస్తత్వ వేత్తల సంఘం జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్‌ పేర్కొన్నారు.

Published : 30 Jun 2022 03:32 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల ఆత్మహత్యలకు వారి తల్లిదండ్రుల ఒత్తిడి కూడా కారణమని భారత ప్రగతిశీల మనస్తత్వ వేత్తల సంఘం జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్‌ పేర్కొన్నారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని శ్రీశ్వేత ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె, వైద్యులు డాక్టర్‌ నాగేశ్వరిరావు, డాక్టర్‌ పి.స్వరూప రాణితో కలసి మాట్లాడారు. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు, ఆత్మవిశ్వాసం నెలకొల్పేందుకు తాము ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఇస్తామని తెలిపారు. అవసరమైన వారు 93900 44031, 93900 44040 చరవాణి నంబర్లలో సంప్రదించాలని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని