logo

10 శాతం అపరాధ రుసుము

నిర్దేశిత గడువులోపు పీహెచ్‌డీ ఫీజు చెల్లించని విద్యార్థులకు అపరాధ రుసుము విధించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. పరిశోధక విద్యార్థులు ఏటా ఫీజులు చెల్లించకపోతే అదనపు భారం పడనుంది.

Published : 30 Jun 2022 03:32 IST

గడువులోపు పీహెచ్‌డీ ఫీజు కట్టనివారిపై జేఎన్‌టీయూ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: నిర్దేశిత గడువులోపు పీహెచ్‌డీ ఫీజు చెల్లించని విద్యార్థులకు అపరాధ రుసుము విధించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. పరిశోధక విద్యార్థులు ఏటా ఫీజులు చెల్లించకపోతే అదనపు భారం పడనుంది. పార్ట్‌టైం, ఫుల్‌ టైం విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులకు ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజు కట్టేందుకు గడువు ఇస్తారు. మూడు నెలల పాటు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ నిర్దేశిత గడువులోగా చెల్లించకపోతే 10 శాతం పెనాల్టీ విధించనున్నారు. ఈ విషయంపై అకాడమిక్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌, పాలకమండలిలో ఆమోదం లభించడంతో ఈ విద్యా సంవత్సరం నుంచే వసూలుకు నిర్ణయించినట్లు తెలిసింది.

పీహెచ్‌డీ సమర్పణ గడువు పెంపు

పీహెచ్‌డీ సిద్ధాంతం సమర్పణ గడువును వచ్చే డిసెంబరు 31 వరకు పొడిగించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. పదేళ్లకు మించి కొనసాగుతున్న విద్యార్థులు పీహెచ్‌డీ కోర్సు పూర్తి చేసుకొనేందుకు తొలుత వచ్చే నెల 4 వరకు అవకాశం కల్పించారు. కొందరు విద్యార్థులు ప్లాగరిజం పరిశీలన దశకు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని