logo

విమాన టిక్కెట్లు తీసుకోండి.. మీ దేశం వెళ్లండి..

నైజీరియా, ఐవరీకోస్ట్‌ దేశాల నుంచి వచ్చి పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు నైజీరియన్లు ఉగ్వు ఆంటోనీ, ఒబిరీయా పీటర్‌,

Updated : 30 Jun 2022 07:13 IST

 

ఈనాడు,హైదరాబాద్‌: నైజీరియా, ఐవరీకోస్ట్‌ దేశాల నుంచి వచ్చి పాస్‌పోర్టులు, వీసాలు లేకుండా హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు నైజీరియన్లు ఉగ్వు ఆంటోనీ, ఒబిరీయా పీటర్‌, చుక్వుడాలు కింగ్స్‌లే, ఇద్దరు ఐవరీకోస్ట్‌ దేశస్థులు కోనె మౌస్సా, విలియమ్‌ డికోస్టైర్‌లను హైదరాబాద్‌ పోలీసులు వారి దేశాలకు పంపించారు. వారివద్ద సొంతదేశాలకు వెళ్లేందుకు డబ్బులేకపోవడంతో పోలీసులే విమాన టిక్కెట్లను కొని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా పంపించామని హైదరాబాద్‌ నుంచి పంపుతున్నామని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

అక్రమంగా 750మంది విదేశీయులు: ఆఫ్రికా దేశాల నుంచి వేర్వేరు వీసాలతో వచ్చి పాస్‌పోర్టు, వీసా గడువు తీరినా 750మంది హైదరాబాద్‌లో ఉంటున్నారని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ప్రాంతీయ విదేశీ నమోదు కార్యాలయం సమాచారం ప్రకారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 2,900మంది విదేశీయులు నివసిస్తున్నారని చెప్పారు. వీరిలో చాలామంది ప్రాంతీయ విదేశీ నమోదు కార్యాలయం అధికారులకు ఎప్పటికప్పుడు వారి సమాచారం అందిస్తున్నారని తెలిపారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ అక్రమ రవాణా వంటి నేరాల్లో ఆఫ్రికన్లు ఎక్కువగా ఉంటున్నారన్న సమాచారంతో తాము ఈ వివరాలను సేకరించామన్నారు. మాదకద్రవ్యాల నిఘా విభాగం డీసీపీ గుమ్మి చక్రవర్తి సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని