logo

తాతకు టాటా చెప్పేందుకు వెళ్లి.. మొదటి అంతస్తు నుంచి పడి బాలుడి మృతి

అప్పటివరకు ఆడుకుంటూ కళ్లెదుటే తిరిగిన రెండున్నరేళ్ల బాలుడు.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది

Updated : 30 Jun 2022 07:05 IST

గోల్కొండ, న్యూస్‌టుడే: అప్పటివరకు ఆడుకుంటూ కళ్లెదుటే తిరిగిన రెండున్నరేళ్ల బాలుడు.. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది. విధులకు వెళుతున్న తాతకు వీడ్కోలు చెప్పేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మొదటి అంతస్తుపై నుంచి కిందపడి మృతిచెందిన ఈ సంఘటన గోల్కొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. షేక్‌పేట సీతానగర్‌కు చెందిన గోవింద్‌ పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌. ఆయన కుమార్తె శ్వేత, రెండున్నరేళ్ల కుమారుడు శ్రీనిష్‌తో కలిసి కొంతకాలంగా పుట్టింటిలోనే ఉంటోంది. వారంతా ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం గోవింద్‌ ఉద్యోగానికి బయలుదేరగా.. తాతకు టాటాకు చెప్పేందుకు శ్రీనిష్‌ ఇంటిలోపలి నుంచి బాల్కనీలోకి వచ్చాడు. ఈ క్రమంలో మొదటి అంతస్తు నుంచి కిందపడటంతో బాలుడి తలకు తీవ్రగాయమైంది. వెంటనే కుటుంబసభ్యులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనిష్‌ బుధవారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని