logo

మదుపు పేరిట రూ.13 కోట్ల వసూళ్లు

ఆహార పదార్థాలు, డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌లో మదుపు చేస్తే కళ్లు చెదిరే లాభాలంటూ మోసం చేసిన తల్లీకొడుకులను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న నాగిళ్ల జెసింత్‌ గతేడాది జాస్‌ అండ్‌ జాక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రారంభించాడు.

Published : 30 Jun 2022 02:28 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: ఆహార పదార్థాలు, డ్రైవ్‌ ఇన్‌ రెస్టారెంట్‌లో మదుపు చేస్తే కళ్లు చెదిరే లాభాలంటూ మోసం చేసిన తల్లీకొడుకులను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న నాగిళ్ల జెసింత్‌ గతేడాది జాస్‌ అండ్‌ జాక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రారంభించాడు. ఫిలింనగర్‌లో తాము క్యూబా డ్రైవ్‌ ఇన్‌ పేరుతో రెస్టారెంట్‌ వ్యాపారం చేస్తున్నామని, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామంటూ పరిచయస్థుల నుంచి రూ.13 కోట్ల మేరకు వసూలు చేశాడు. లాభాలు అడిగినందుకు బెదిరించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు తల్లీకొడుకులు నాగిళ్ల సుకన్య, జెసింత్‌లను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరిపై గతంలో బంజారాహిల్స్‌, సనత్‌నగర్‌ పోలీస్‌ ఠాణాల్లో కేసులున్నట్లు ఏసీపీ ఎం.సందీప్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని