logo

అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కల్యాణం

పార్టీలు, రాజకీయాలకతీతంగా అందరం కలిసికట్టుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. జులై 5న జరిగే ఎల్లమ్మ కల్యాణం, 6న రథోత్సవం సందర్భంగా తరలివచ్చే భక్తుల కోసం దేవాలయం....

Updated : 30 Jun 2022 06:02 IST

ఏర్పాట్లపై సమీక్షలో మంత్రి తలసాని


చీర నేతను ప్రారంభిస్తున్న మంత్రి తలసాని

సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే: పార్టీలు, రాజకీయాలకతీతంగా అందరం కలిసికట్టుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిద్దామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. జులై 5న జరిగే ఎల్లమ్మ కల్యాణం, 6న రథోత్సవం సందర్భంగా తరలివచ్చే భక్తుల కోసం దేవాలయం వద్ద, పరిసరాల్లో ఏర్పాట్లు, సౌకర్యాలపై ఈవో ఎస్‌.అన్నపూర్ణ అధ్యక్షతన బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు అధికారులకు మంత్రి సూచించారు. జలమండలి, జీహెచ్‌ఎంసీ, ఆర్టీసి, వైద్యారోగ్య, అగ్నిమాపక, విద్యుత్‌, ఆర్‌ అండ్‌బీ శాఖల అధికారులతో చర్చించి ఉత్సవాల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కల్యాణానికి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. కల్యాణం ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ, జిల్లా వైద్యాధికారి డా.వెంకటి, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, జలమండలి ఈఎన్‌సి కృష్ణ, జీఎం హరిశంకర్‌, దేవస్థానం ఛైౖర్మన్‌ సాయిబాబాగౌడ్‌, పంజాగుట్ట ఏసీపీ గణేష్‌, ట్రాపిక్‌ ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి, కార్పొరేటర్‌ కేతినేని సరళ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

ఆలయంలోనే కల్యాణం పట్టుచీర నేత

ఎల్లమ్మ కల్యాణం కోసం అమ్మవారి పట్టుచీరను మొదటిసారి దేవాలయంలోనే తయారు చేస్తున్నారు. ఇందుకు దేవాలయానికి మగ్గం తీసుకొచ్చారు. చీర నేసే పనిని మంత్రి తలసాని ప్రారంభించారు. 4600 పట్టుపురుగుల నుంచి తీసిన నూలుతో నెమళ్లు, పూలతో కూడిన పసుపురంగులో చీరను నేస్తున్నారు. నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయరాజ్‌ తెలిపారు. ఇటీవల ఆధునికీకరించిన వీఐపీ విడిది కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని