logo

వాహనాల కూత.. చెవిలో మోత

నగరంలో పెరుగుతున్న వాహనాలతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఏటా వాయు నాణ్యత తగ్గిపోవడానికి 51 శాతం వాహనాల నుంచి వెలువడే కాలుష్యమే కారణం.

Published : 30 Jun 2022 02:28 IST

ఈనాడు- హైదరాబాద్‌

నగరంలో పెరుగుతున్న వాహనాలతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఏటా వాయు నాణ్యత తగ్గిపోవడానికి 51 శాతం వాహనాల నుంచి వెలువడే కాలుష్యమే కారణం. ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్ని ప్రాంతాల్లో సీపీసీబీ నిర్దేశిత పరిమితులకు మించి ధ్వని కాలుష్యం నమోదైంది. నివాస ప్రాంతాల్లో సగటున 10 డెసిబుల్స్‌ కంటే ఎక్కువ రికార్డయ్యాయి. 2021 కన్నా ఇది ఎక్కువ.

తొమ్మిది ప్రాంతాల్లో లెక్కింపు..!

కాలుష్య నియంత్రణ మండలి.. వాణిజ్య, నివాస, పారిశ్రామిక, సున్నిత ప్రాంతాలుగా వర్గీకరించి శబ్ద కాలుష్యాన్ని లెక్కిస్తోంది. సీపీసీబీ పరిమితులు ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా ఉంటాయి. నగరంలో జూబ్లీహిల్స్‌, తార్నాక, అబిడ్స్‌, జేఎన్‌టీయూ, సనత్‌నగర్‌, జీడిమెట్ల, జూపార్క్‌, గచ్చిబౌలిలో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేస్తుంది. ఉదయం, పగలుగా విభజించి శబ్దాలను రికార్డు చేస్తోంది.

తార్నాకలో శబ్ద కాలుష్యం ఎక్కువ

తార్నాకలో ఇటీవల శబ్ద కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. 2021లో 60 డెసిబుల్స్‌గా నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 67 డెసిబుల్స్‌ వరకు పెరిగింది. అత్యంత సున్నిత ప్రాంతమైన జూపార్కు వద్ద 70కి చేరింది. పారిశ్రామిక ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతూ.. నివాస సముదాయాల్లో పెరుగుతోంది. శబ్ద తీవత్ర పెరగడంతో నగరవాసులకు ప్రశాంతత కరవవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని