logo

బాధిత కుటుంబానికి పూర్వవిద్యార్థుల చేయూత

వారంతా తాండూరు శ్రీ సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల 1998 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు. ఉన్నత చదువులు పూర్తి చేసి వ్యాపార, ఉద్యోగ, వృత్తి రంగాల్లో హైదరాబాద్‌, తాండూరు, విదేశాల్లో స్థిరపడ్డారు.

Published : 30 Jun 2022 02:28 IST

వాట్సాప్‌ ద్వారా స్నేహితుల సాయం


ఆర్థికసాయం అందిస్తున్న మిత్ర బృందం

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: వారంతా తాండూరు శ్రీ సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల 1998 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు. ఉన్నత చదువులు పూర్తి చేసి వ్యాపార, ఉద్యోగ, వృత్తి రంగాల్లో హైదరాబాద్‌, తాండూరు, విదేశాల్లో స్థిరపడ్డారు. వాట్సాప్‌ అందుబాట్లోకి రావడంతో నాలుగేళ్ల కిందట ఎస్‌ఎస్‌ఎస్‌ఎమ్‌టీ కుటుంబం పేరిట వాట్సాప్‌ సమూహం ప్రారంభించారు. నిత్యం పలకరింపులతో పాఠశాల నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల వీరిలో ఒకరైన గాంధీనగర్‌కు చెందిన రవికుమార్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని వాట్సాప్‌ సమూహం ద్వారా తెలుసుకున్న పూర్వ విద్యార్థులు, స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తలాకొంత ఆర్థికసాయం చేయగా రూ.1,40,500 జమయ్యాయి. అతని కుమారుడు అన్వేష్‌ ఉన్నత చదువులకు రూ.1.10 లక్షలు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. రవికుమార్‌ భార్య అంజమ్మకు కుట్టు మిషన్‌ను కొనుగోలు చేసి ఇచ్చారు. బుధవారం పూర్వ విద్యార్థుల బృందం స్నేహితుడి నివాసానికి వెళ్లి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాలు, కుట్టుమిషన్‌, రూ.18,500 నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. సంతోషంలోనే కాకుండా, మిత్రుడి కుటుంబానికి ఆపన్న హస్తం అందించి ఆదుకునే స్నేహితులు ఉండటం అభినందనీయమని కుటుంబసభ్యులు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని