Konda vishweshwar reddy: అందుకే భాజపాలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వరరెడ్డి

సుదీర్ఘ మంతనాల తర్వాత భాజపాలో చేరాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో

Updated : 30 Jun 2022 20:24 IST

హైదరాబాద్: సుదీర్ఘ మంతనాల తర్వాత భాజపాలో చేరాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని, అందువల్లే కొంతకాలంగా భాజపా నేతలతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో తెరాసను ఎదుర్కోవాలంటే ఒక్క భాజపా వల్లే సాధ్యమని తేల్చి చెప్పారు.  

‘‘తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది అనుకున్నాం. కానీ, రాష్ట్రం ఇప్పుడు అధ్వాన్నంగా తయారైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి శూన్యం. ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెట్టారు. తెలంగాణను వ్యతిరేకించిన పువ్వాడ అజయ్ కుమార్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెరాసలో మంత్రులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా హుజూరాబాద్ ఫలితాలే వస్తాయి. తెలంగాణలో భాజపా అధికారంలో వస్తుందన్న విశ్వాసం ఉంది. నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. రేవంత్‌కు సకాలంలో పీసీసీ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ లోనే ఉండేవాడ్ని. నేను రేవంత్‌కు వ్యతిరేకం కాదు. భాజపా పూర్తి క్రమశిక్షణ కలిగిన పార్టీ. తానేమీ పదవులు ఆశించి భాజపాలోకి వెళ్లడం లేదు. సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరుతున్నాను. ఎప్పుడు, ఎక్కడ భాజపాలో చేరేది బండి సంజయ్, కిషన్ రెడ్డికి వదిలేశా’’ అని  విశ్వేశ్వర రెడ్డి స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని