Telangana News: తెలంగాణలో భాజపాకు బిగ్‌ షాక్‌... తెరాసలో చేరిన కార్పొరేటర్లు

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న వేళ భాజపాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్‌ఎంసీకి చెందిన

Updated : 30 Jun 2022 20:18 IST

హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న వేళ భాజపాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్‌ఎంసీకి చెందిన నలుగురు భాజపా కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్‌ భాజపా ఫ్లోర్‌ లీడర్‌ గురువారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఇటీవలే జీహెచ్‌ఎంసీ భాజపా కార్పొరేటర్లతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్న వేళ నలుగురు కార్పొరేటర్లు భాజపాను వీడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాండూరు మున్సిపల్‌ భాజపా ఫ్లోర్‌ లీడర్‌ సింధూజగౌడ్‌, హస్తినాపురం కార్పొరేటర్‌ బానోతు సుజాతా నాయక్‌,  రాజేంద్రనగర్‌ కార్పొరేటర్‌ అర్చన ప్రకాశ్‌, అడిక్‌మెట్‌ కార్పొరేటర్‌ సునీత ప్రకాశ్‌గౌడ్‌, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ డేరంగుల వెంకటేశ్‌ తెరాసలో చేరిన వారిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని