logo

ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్‌ మార్గదర్శకాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో భాజపా జాతీయ సమావేశాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ నెల 2, 3వ తేదీల్లో పలు ట్రాఫిక్‌ మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు డీసీపీ (ట్రాఫిక్‌) శ్రీనివాస్‌

Published : 01 Jul 2022 03:53 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో భాజపా జాతీయ సమావేశాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ నెల 2, 3వ తేదీల్లో పలు ట్రాఫిక్‌ మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు డీసీపీ (ట్రాఫిక్‌) శ్రీనివాస్‌ రావు ప్రటకనలో పేర్కొన్నారు.

ఈ క్రమంలో.. కావూరీహిల్స్‌ నుంచి కొత్తగూడ జంక్షన్‌ వరకు, హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ నుంచి ఐకియా రోటరీప్రాంతం వరకు ఉన్న ఐటీ సంస్థలు తమ కార్యాలయాల సమయాలను మార్చుకోవడం లేని పక్షంలో ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి విధులు (వర్క్‌ ఫ్రం హోం) నిర్వహించుకునేలా చూసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ దారుల్లో రాకపోకలు సాగించి ట్రాఫిక్‌ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని సూచించారు.

ప్రత్యామ్నాయ దారులివీ..

నీరుస్‌ జంక్షన్‌ నుంచి.. ఇటు కొత్తగూడ, గచ్చిబౌలి కూడళ్ల వైపునకు రావాలనుకునే వాహనదారులు.. సీఓడీ జంక్షన్‌ వద్ద మలుపు తీసుకుని దుర్గంచెరువు, ఇనార్బిట్‌ మాల్‌, ఐటీసీ కోహినూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ పార్కు కూడలి, గచ్చిబౌలి దారిని అనుసరించాలి. అటు వెళ్లేందుకూ ఇదే మార్గాన్ని వినియోగించుకోవచ్చు.

మియాపూర్‌, హఫీజ్‌పేట్‌, కొత్తగూడ నుంచి హైటెక్‌ సిటీ, సైబర్‌ టవర్స్‌, జూబ్లీహిల్స్‌కు వచ్చేందుకు. రోలింగ్‌ హిల్స్‌, ఏఐజీ ఆసుపత్రి, ఐకియా, ఇనార్బిట్‌ మాల్‌, దుర్గం చెరువు దారిని అనుసరించాలి..

ఆర్‌సీపురం, చందానగర్‌ నుంచి.. బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ, ట్రిపుల్‌ ఐటీ, గచ్చిబౌలి రోడ్డులో ఇటు మాదాపూర్‌, గచ్చిబౌలికి చేరుకోవాలి.

ఈ మార్గాల్లో భారీ వాహనాలు నిషిద్ధం..

జేఎన్‌టీయూ నుంచి సైబర్‌ టవర్స్‌

మియాపూర్‌ నుంచి కొత్తగూడ

కావూరి హిల్స్‌ నుంచి కొత్తగూడ

బయోడైవర్సిటీ పార్కు నుంచి జేఎన్‌టీయూ

నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి గచ్చిబౌలి పగలు ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు మాదాపూర్‌ జోన్‌లో భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తామని డీసీపీ తెలిపారు. ప్రజలను ప్రత్యామ్నాయ దారులను వినియోగించుకుని సహకారం అందించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని