logo

బాలల అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

బాలల అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకున్నామని కాచిగూడ రైల్వే స్టేషన్‌ డైరెక్టర్‌ ప్రభుచరణ్‌ తెలిపారు. కొన్ని ముఠాలు ఒంటరి బాలలను రైళ్లలో అక్రమంగా తరలించకుండా గట్టి నిఘా పెట్టామన్నారు. గురువారం కాచిగూడ

Published : 01 Jul 2022 03:53 IST

మాట్లాడుతున్న ప్రభుచరణ్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: బాలల అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకున్నామని కాచిగూడ రైల్వే స్టేషన్‌ డైరెక్టర్‌ ప్రభుచరణ్‌ తెలిపారు. కొన్ని ముఠాలు ఒంటరి బాలలను రైళ్లలో అక్రమంగా తరలించకుండా గట్టి నిఘా పెట్టామన్నారు. గురువారం కాచిగూడ రైల్వేస్టేషన్లో ఆశ్రిత ఛైల్డ్‌లైన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికులకు రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఒంటిరి బాలలు కనపడిన వెంటనే టోల్‌ఫ్రీ నెంబరు: 1098కు సమాచారం ఇవ్వాలన్నారు. స్టేషన్‌ మేనేజర్‌ ఆర్‌కే మీన, ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ధర్మేందర్‌కుమార్‌, హెల్త్‌ఇన్‌స్పెక్టర్‌ సోమరాజు, ఆశ్రితకార్యదర్శి నాగరాజు, ఛైల్డ్‌లైన్‌ సమన్వయకర్త పర్వతాలు, రామస్వామి, కృష్ణవేణి, శారద, పద్మ, యాదయ్య, రాధిక, శేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని