logo

పది ఫలితాల్లో శ్రీచైతన్య ఘనవిజయం

గురువారం ప్రకటించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రాష్ట్రంలోని తెలంగాణ శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌ విద్యార్థులు విజయదుందుభి మోగించారని శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య ఒక ప్రకటనలో

Published : 01 Jul 2022 03:53 IST

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: గురువారం ప్రకటించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రాష్ట్రంలోని తెలంగాణ శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌ విద్యార్థులు విజయదుందుభి మోగించారని శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య ఒక ప్రకటనలో తెలిపారు. 408 మంది విద్యార్థులు 10జీపీఏ సాధించారని, 914మంది 9.8జీపీఏ, 1,887మంది 9.5జీపీఏ, 2,846మంది 9.0జీపీఏ సాధించినట్లు తెలిపారు. ఏవన్‌ గ్రేడ్‌లను గణితంలో 2,998మంది, సాంఘికశాస్త్రంలో 2,284మంది, సైన్స్‌లో 1,874మంది, సబ్జెక్టు వారీగా మొత్తం 19,466మంది సాధించినట్లు పేర్కొన్నారు.

పది ఫలితాల్లో మెరిసిన త్రివేణి
ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి ఫలితాల్లో త్రివేణి విద్యాసంస్థల విద్యార్థులు సత్తా చాటినట్లు ఆ సంస్థ డైరెక్టక్‌ గొల్లపూడి వీరేంద్రచౌదరి తెలిపారు. 95 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారని గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 304 మంది 9.7పైగా పాయింట్లు, 673 మంది 9పైన పాయింట్లు సాధించారని పేర్కొన్నారు. మొత్తం 4,831 మంది ఏ గ్రేడ్‌ సాధించారని వివరించారు. గణితంలో 916 మంది, విజ్ఞాన శాస్త్రంలో 768 మందికి ఏ గ్రేడ్‌ వచ్చిందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని