logo

అంతా నిర్లక్ష్యం

ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండదు.. పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ కనిపించదు.. ప్రభుత్వ పాఠశాలలపై అజమాయిషీ ఉండదు.. విద్యాశాఖాధికారుల ఉదాసీన వైఖరితో హైదరాబాద్‌ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధ్వానస్థితికి చేరుకుంది. మిగిలిన జిల్లాలతో

Published : 01 Jul 2022 06:52 IST

నామ్‌ కే వాస్తే రివిజన్‌.. అధికారుల పర్యవేక్షణ శూన్యం

హైదరాబాద్‌ జిల్లా వెనుకబాటుకు కారణాలెన్నో..!

ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అట్టడుగు స్థానంలో ఉండటంపై పోస్టుమార్టం చేయాల్సిన అవసరం ఉంది. కొంతకాలంగా ఎందుకు వెనుకపడుతోందో పరిశీలిస్తాం. జిల్లాపై వందశాతం దృష్టి సారిస్తాం.  

- పదో తరగతి ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి


పదో తరగతిలో హైదరాబాద్‌ జిల్లా చివరి స్థానంలో నిలవడం ఇప్పుడేం కొత్త కాదు. గత కొన్నేళ్ల ఫలితాలు గమనిస్తే ఇదే పరిస్థితి ఉంది. చివరి స్థానమో.. చివరి నుంచి రెండో స్థానంలోనో ఉంటోంది..’’

- హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్‌.రోహిణి

న్నతాధికారుల పర్యవేక్షణ ఉండదు.. పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ కనిపించదు.. ప్రభుత్వ పాఠశాలలపై అజమాయిషీ ఉండదు.. విద్యాశాఖాధికారుల ఉదాసీన వైఖరితో హైదరాబాద్‌ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధ్వానస్థితికి చేరుకుంది. మిగిలిన జిల్లాలతో పోటీ పడలేక రాష్ట్రంలోనే చివరి స్థానం దక్కించుకుంటోంది. పదో తరగతిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 73,957 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 58,889 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం కేవలం 79.63శాతంగా ఉంది. వాస్తవానికి కొన్నేళ్లుగా హైదరాబాద్‌ అథమస్థానంలో ఉంటోందని విద్యాశాఖాధికారులు చెప్పే మాట.  ఈసారి ప్రత్యేక తరగతులు నామ్‌ కే వాస్తేగా నిర్వహించారు. డీఈవో సహా ఉప విద్యాశాఖాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్న విమర్శలున్నాయి. చాలావరకు ఉపాధ్యాయులు తూతూమంత్రంగా ప్రత్యేక తరగతులు కానిచ్చేశారు. రివిజన్‌, ప్రాక్టీస్‌ పేపర్ల విషయంలో ఇదే ధోరణి అవలంబించారు. జిల్లాలో ఉప విద్యాశాఖాధికారుల నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు ఇన్‌ఛార్జుల పాలనే నడుస్తోంది. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ ఐవోఎస్‌లు.. ఇలా అన్నిస్థాయిల్లోనూ ఇన్‌ఛార్జులే ఉన్నారు. ఏళ్ల తరబడిగా రెగ్యులర్‌ అధికారులతో భర్తీ చేసే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.

ఫలితాలు వచ్చిన కాసేపటికే బదిలీలు
తాజాగా పదో తరగతి ఫలితాలు వచ్చిన కాసేపటికే హైదరాబాద్‌ జిల్లాలో ఉప విద్యాశాఖాధికారులు, డిప్యూటీ ఐవోఎస్‌లను బదిలీ చేస్తూ డీఈవో రోహిణి నిర్ణయం తీసుకున్నారు.12 మంది డిప్యూటీఈవోలు, 23 మంది డిప్యూటీ ఐవోఎస్‌లను కొత్త వారిని నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని