logo

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

పనిచేస్తున్న కంపెనీలో దొంగతనం నెపం మోపారని. మనస్తాపానికి గురైన యువకుడు చర్లపల్లి ఎఫ్‌సీఐ గిడ్డంగి గోదాం సమీపంలో ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంధువులు, స్థానికులు తెలిపిన

Published : 02 Jul 2022 01:33 IST

కుషాయిగూడ, న్యూస్‌టుడే: పనిచేస్తున్న కంపెనీలో దొంగతనం నెపం మోపారని. మనస్తాపానికి గురైన యువకుడు చర్లపల్లి ఎఫ్‌సీఐ గిడ్డంగి గోదాం సమీపంలో ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలం తూంపల్లికి చెందిన తెలుగు గణేష్‌(20) కుటుంబంతో కలిసి కాప్రా సర్కిల్‌ అశోక్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఆయన ఏడాదిన్నరగా చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్‌-1లో ఉన్న టెర్రాటన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎల్‌ఈడీ బల్బులు అపహరించారనే నెపంతో మూడు రోజులు కంపెనీలో నిర్బంధించారు. గురువారం రాత్రి కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. ఉదయం రావాలని చెప్పి పోలీసులు యువకుడిని తల్లిదండ్రులతో పంపించారు. శుక్రవారం ఉదయం 8కి యువకుడిని తీసుకొని ఆయన మామ చర్లపల్లిలోని కంపెనీ వద్దకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. గణేష్‌ను కంపెనీలో వదిలి వెళ్లిపోయారు. చేయని తప్పునకు తనని చిత్రహింసలకు గురిచేశారని.. యువకుడు తోటి కార్మికులతో వాపోయారు. ఈ నేపథ్యంలోనే గురై మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎఫ్‌సీఐ గిడ్డంగుల గోదాం సమీపంలో ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు, బంధువులు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని