logo

మహిళల భద్రతలో తెలంగాణ అగ్రగామి

మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. తాజ్‌ డెక్కన్‌లో ‘ప్రజ్వల’ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు.

Published : 02 Jul 2022 01:33 IST

జ్యోతి వెలిగిస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌, చిత్రంలో సునీతా లక్ష్మారెడ్డి తదితరులు

బంజారాహిల్స్‌: మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. తాజ్‌ డెక్కన్‌లో ‘ప్రజ్వల’ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రపంచంలో డ్రగ్స్‌, ఆయుధాల సరఫరా తరువాత మానవ అక్రమ రవాణా ఆందోళనకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో జస్టిస్‌ నవీన్‌ రావు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, వివిధ రాష్ట్రాల శిశు, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని