logo

కండరాల క్షీణత సమస్య పరిష్కారానికి జీన్‌ థెరపీ: డా. అర్కసుభ్రఘోష్‌

జన్యు సంబంధితమైన కండరాల క్షీణత సమస్య పరిష్కారానికి త్వరలో జీన్‌ థెరపీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బెంగళూరులోని నారాయణ నేత్రాలయ ఫౌండేషన్‌, గ్రో ల్యాబ్స్‌ డైరెక్టర్‌ డా.అర్కసుభ్రఘోష్‌ తెలిపారు. భారత్‌ ఎండీ ఫౌండేషన్‌,

Published : 02 Jul 2022 01:33 IST

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: జన్యు సంబంధితమైన కండరాల క్షీణత సమస్య పరిష్కారానికి త్వరలో జీన్‌ థెరపీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బెంగళూరులోని నారాయణ నేత్రాలయ ఫౌండేషన్‌, గ్రో ల్యాబ్స్‌ డైరెక్టర్‌ డా.అర్కసుభ్రఘోష్‌ తెలిపారు. భారత్‌ ఎండీ ఫౌండేషన్‌, టీఎండీఏ, సాక్ష్యం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలలో శుక్రవారం జీన్‌ థెరపీపై కార్యశాల నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన డా.అర్కసుభ్రఘోష్‌ మాట్లాడుతూ.. జన్యు సంబంధంగా సంక్రమించే కండరాల క్షీణత సమస్యతో ఎంతోమంది బాధపడుతున్నారని తెలిపారు. దీనిపై కొంతకాలంగా తాను పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జంతువులపై చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలనిచ్చాయన్నారు. మరో ఏడాదిన్నర కాలంలో ఈ చికిత్సా విధానం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈఎస్‌ఐసీ వైద్య నిపుణులు సుధాబాల, ఈఎస్‌ఐసీ కళాశాల న్యూరో పిడియాట్రిక్‌ విభాగాధిపతి డా.కోదండపాణి, వైద్యకళాశాల డీన్‌ డా.శ్రీనివాస్‌ తదితరులతో పాటు ఈఎస్‌ఐసీ వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని