logo

చేకూరి రామారావు పుస్తకాల ఆవిష్కరణ

మనసు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేకూరి రామారావు (చేరా) సర్వలభ్యరచనల ఆవిష్కరణ సభ శుక్రవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ఘనంగా జరిగింది. పుస్తకాలను చేకూరి రంగనాయకి ఆవిష్కరించగా

Published : 02 Jul 2022 01:33 IST

చేరా రచనలను ఆవిష్కరించిన ప్రముఖులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: మనసు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేకూరి రామారావు (చేరా) సర్వలభ్యరచనల ఆవిష్కరణ సభ శుక్రవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ఘనంగా జరిగింది. పుస్తకాలను చేకూరి రంగనాయకి ఆవిష్కరించగా కృష్ణాబాయి స్వీకరించారు. ప్రముఖ సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. మేథస్సు, గాఢత్వం, బుద్ధికుశలత ఇవన్నీ పరిశీలిస్తే తెలుగు భాషా శాస్త్ర రంగంలో ‘చేరా’ అరుదైన వ్యక్తిగా కనిపిస్తాడని అన్నారు. ఎన్‌.వేణుగోపాల్‌, యాకూబ్‌, కొండేపూడి నిర్మల, గారపాటి ఉమామహేశ్వరరావు, డొక్కా మాణిక్యవరప్రసాదరావు, నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు