logo

తెలుగునాట ‘పద్మ’ పురస్కారాలు తగ్గుతున్నాయ్‌

తెలుగునాట ‘పద్మ’ పురస్కారాలు తగ్గిపోతున్నాయ్‌. ఎంతో ప్రయత్నం చేస్తేగానీ సాహిత్య అకాడమీ పురస్కారాలు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయాలు చూసుకుంటున్నాయి. కానీ, కళాకారులు, కవులు, పండితులు ఇతరులకు

Published : 02 Jul 2022 01:33 IST

నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాల్లో రమణాచారి

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగునాట ‘పద్మ’ పురస్కారాలు తగ్గిపోతున్నాయ్‌. ఎంతో ప్రయత్నం చేస్తేగానీ సాహిత్య అకాడమీ పురస్కారాలు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయాలు చూసుకుంటున్నాయి. కానీ, కళాకారులు, కవులు, పండితులు ఇతరులకు ‘పద్మ’ పురస్కారాలు వస్తున్నయా? లేదా అని దృష్టిని సారించట్లేదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నృత్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన సభ నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నృత్యశాఖాధిపతి ప్రొ.అనురాధ తడకమళ్ల, వర్సిటీ పీఠాధిపతి ఆచార్య కోట్ల హనుమంతరావు, నృత్యశాఖాధిపతి వనజా ఉదయ్‌, నాట్యగురువు కళాకృష్ణ, నాట్యగురువు భాగవతుల సేతురామ్‌లు ఉన్నారు. గురు కళాకృష్ణ పర్యవేక్షణలో ఆంధ్రనాట్యం, పేరిణి ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని