logo

చార్మినార్‌లో ‘పన్ను’ పరేషాన్‌!

నగరంలోని చార్మినార్‌ సర్కిల్‌ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లు పడకేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొదటి ఆరు నెలల్లో చెల్లించాల్సిన పన్ను పెద్దమొత్తంలో బకాయి పడ్డట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరో పది సర్కిళ్ల పరిధిలోనూ పన్ను రాబడి

Published : 02 Jul 2022 01:33 IST

మొత్తం 11 సర్కిళ్ల ఏఎంసీలను హెచ్చరించిన సీవీవో

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌ సర్కిల్‌ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లు పడకేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొదటి ఆరు నెలల్లో చెల్లించాల్సిన పన్ను పెద్దమొత్తంలో బకాయి పడ్డట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరో పది సర్కిళ్ల పరిధిలోనూ పన్ను రాబడి తగ్గింది. దీంతో సంబంధిత బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లపై జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బకాయిదారుల నుంచి పన్ను వసూలు చేయాల్సిన సిబ్బంది, అధికారులు.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొంది. ఆస్తిపన్ను వసూలులో నిర్దేశిత లక్ష్యాన్ని కనీసం చేరుకోని అధికారులు వివరణ ఇవ్వాలంటూ సీవీవో(చీఫ్‌ వాల్యుయేషన్‌ ఆఫీసర్‌) కులకర్ణి శుక్రవారం సర్కిళ్ల ఏఎంసీలకు ఆదేశాలిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని