logo

ఆలోచన రంగురించి..

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నిరోధించేందుకు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ అధికారులు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. సర్కిల్‌ ఏఎంహెచ్‌వో ఆంజనేయులు తన పరిధిలో ఆటో సిబ్బందికి చెత్త ఇచ్చిన వారి ఇంటి గోడపై పచ్చని రంగులో రైటు గుర్తు వేయిస్తున్నారు.

Published : 02 Jul 2022 02:04 IST

లక్ష్మీనగర్‌ కాలనీ ఇళ్లలో వ్యర్థాలు వేరుచేసి ఇచ్చేవారి

ఇంటి గోడపై రైటు గుర్తు వేస్తున్న సిబ్బంది.

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నిరోధించేందుకు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ అధికారులు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. సర్కిల్‌ ఏఎంహెచ్‌వో ఆంజనేయులు తన పరిధిలో ఆటో సిబ్బందికి చెత్త ఇచ్చిన వారి ఇంటి గోడపై పచ్చని రంగులో రైటు గుర్తు వేయిస్తున్నారు. ఇవ్వకుండా ఆరు బయట పడేసేవారి ఇంటి గోడపై ఎరుపు రంగులో ఇంటూ గుర్తు వేసి హెచ్చరిస్తున్నారు. దీంతో ఆరుబయట చెత్త వేసేవారి సంఖ్య తగ్గిందన్నారు. బయట ప్రాంతాల నుంచి తెచ్చి కూడళ్లలో వేసే వారిని నివారించడానికి సీసీ కెమెరాతో పాటు మైకు ఏర్పాటుచేసి హెచ్చరిస్తున్నామని, గుర్తించి జరిమానాలు వేస్తున్నామని తెలిపారు.

జనప్రియ కూడలిలో సీసీ కెమెరాతో పాటు

ఏర్పాటు చేసిన మైకు.. చరవాణిలో పర్యవేక్షణ​​​​​​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని