logo

బినామీల పేరుతో అక్రమాస్తులు

జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ గాదె ప్రవీణ్‌కుమార్‌ అధీనంలో భారీగా అక్రమాస్తులున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) తనిఖీల్లో వెల్లడైంది. బాలాపూర్‌ మండలం వెంకటాపూర్‌లోని అతడి నివాసం, బంధువుల ఇళ్లతోపాటు కార్యాలయంలో అనిశా బృందాలు గురువారం

Published : 02 Jul 2022 02:04 IST

జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ నిర్వాకం

ఈనాడు, హైదరాబాద్‌: జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ గాదె ప్రవీణ్‌కుమార్‌ అధీనంలో భారీగా అక్రమాస్తులున్నట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) తనిఖీల్లో వెల్లడైంది. బాలాపూర్‌ మండలం వెంకటాపూర్‌లోని అతడి నివాసం, బంధువుల ఇళ్లతోపాటు కార్యాలయంలో అనిశా బృందాలు గురువారం రాత్రి వరకు జరిపిన సోదాల్లో రూ.3,30,52,300 ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బినామీల పేరిట ఉన్న విక్రయ ఒప్పంద దస్తావేజుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అతడి ఇంట్లో ఏకంగా 73 నాన్‌జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు లభించాయి. దీన్ని బట్టి అక్రమ సంపాదనతో స్థిరాస్తులు కొనుగోలు చేయడంతోపాటు స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు. అక్రమాస్తుల గురించి ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అనిశా ప్రకటించింది. గురువారం రాత్రి అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. న్యాయస్థానం ఈ నెల 15 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు అనిశా వర్గాలు వెల్లడించాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని