logo

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

Published : 02 Jul 2022 02:04 IST

మాట్లాడుతున్న టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రైవేటీకరణకు దారి తీసే జాతీయ విద్యావిధానం 2020 వెంటనే రద్దు చేయాలన్నారు. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాసే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బందెప్ప, ఉపాధ్యక్షుడు నర్సింహులు, కోశాధికారి జమున, బాబురావు, పవన్‌కుమార్‌, మోయిజ్‌ఖాన్‌, రత్నం, కృష్ణవేణి, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని